ప్రపంచంలోనే అందగాడు ఇతను..

ప్రపంచంలోనే అందగాడు ఇతను..

మహేశ్​.. ఆ పేరులోనే ఓ మత్తుందబ్బా అంటారు అమ్మాయిలు. అవును మరి, అందానికి కేరాఫ్​ టాలీవుడ్​ ప్రిన్స్​ కదా. మోస్ట్​ ఎలిజబుల్​ బ్యాచిలర్​ ఎవరు.. అంటే, ఇంకెవరు.. ప్రభాస్​ అనేస్తారు. మరి, ప్రపంచంలో అందరినీ మించిన అందగాడు ఎవరు..? అంటే వచ్చే సమాధానం మాత్రం, రాబర్ట్​ ప్యాటిన్సన్​. బ్రిటన్​కు చెందిన ఈ ‘బ్యాట్​మ్యాన్​’.. గోల్డెన్​ రేషియోలో టాపర్​ మరి. సైన్స్​ ప్రకారం అంతే మరి. అందం డెఫినిషన్​కు గ్రీక్​ గోల్డెన్​ రేషియో ఆఫ్​ బ్యూటీ ఫై అనేది ఓ కొలత! ఆ లెక్కల ప్రకారం ఈ బ్యాట్​మ్యాన్​ స్కోరు 92.15%. కళ్లు, కనుబొమ్మలు, ముక్కు, పెదాలు, గదమ, దవడ, మొహం రూపును బట్టి అతగాడికి ఆ స్కోరొచ్చింది. కంప్యూటర్​ మ్యాపింగ్​ టెక్నిక్​ ద్వారా టాప్​ టెన్​ లిస్టును తయారు చేశారు.

ఆ లిస్టు ప్రకారం బ్యాట్​మ్యాన్​ రాబర్ట్​ ప్యాటిన్సన్​ నుదురుకు 93.6%, కళ్ల పొజిషన్​కు 94.7%, ముక్కు వెడల్పు, పొడవుకు 94.67, గదమకు 95.1, మొహం రూపు 91.1, ముక్కు బేస్​కు 89.4, పెదాలకు 82% స్కోరు వచ్చింది. మొత్తంగా 92.15% స్కోరుతో ప్యాటిన్సన్​.. ప్రపంచపు అందగాడు అయిపోయాడు. ఇక, ఆ తర్వాత 91.64% స్కోరుతో హాలీవుడ్​ కొత్త సూపర్​మ్యాన్​ హెన్రీ కెవిల్​ సెకండ్​ ర్యాంక్​ కొట్టేశాడు. 91.08 స్కోరుతో బ్రాడ్లీ కూపర్​ మూడో ప్లేస్​ సాధించాడు. బ్రాడ్​పిట్​ (90.51), జార్జ్​ క్లూనీ (89.91), హ్యూ జాక్​మాన్​ (89.64), డేవిడ్​ బెక్​హాం (88.96), ఇద్రిస్​ ఎల్బా (88.01), కాన్యీ వెస్ట్​ (87.94), రయన్​ గోస్లింగ్​ (87.48) స్కోర్లతో టాప్​టెన్​లో చోటు దక్కించుకున్నారు.

మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి