పిల్లలను కాపాడి తల్లి మృతి

పిల్లలను కాపాడి తల్లి మృతి
  • ఢీకొట్టబోయిన సెప్టిక్​ ట్యాంకర్​
  • పక్కకు తోసేసి ప్రాణాలు కోల్పోయిన అమ్మ 
  • మృతురాలు గర్భిణి

అయిజ : జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజ టీచర్స్ కాలనీకి చెందిన ఓ గర్భిణి తన పిల్లలను కాపాడి ప్రాణాలు కోల్పోయింది. టౌన్​కు చెందిన నాగలక్ష్మి (28), రామకృష్ణ భార్యాభర్తలు. వీరికి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే ట్యాంకర్ ఉంది. ఆదివారం ఒకరు తన సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయాలని అడగ్గా...డ్రైవర్ లేడని, వేరే డ్రైవర్ ఉంటే తీసుకువెళ్లొచ్చని చెప్పారు. పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని తీసుకువచ్చి సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ను తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పటికే ఆ వాహనం రివర్స్ గేర్ లో ఉండడంతో వెనుకకు వెళ్లింది. నాగలక్ష్మి ఇద్దరు పిల్లలు అక్కడే ఆడుకుంటుండడంతో గమనించి వారిని కాపాడేందుకు పక్కకు తోసేసింది. ఎనిమిది నెలల గర్భిణి కావడంతో వేగంగా తప్పుకోలేకపోయింది. క్లీనర్ మెషీన్ ​బలంగా ఢీకొట్టడంతో గాయపడింది. ట్రీట్ మెంట్ కోసం కర్నూల్ కి తరలించగా, సోమవారం చనిపోయింది. నాగలక్ష్మికి ఇప్పటికే ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఎస్ఐ నరేశ్​కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం : -

ఇకపై చదువులకు గ్రేడింగ్!


డ్రిప్​ సాంక్షన్​ చేస్తలేరు వేలల్లో అప్లికేషన్లు.. వందల్లో మంజూరు