
హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌కు అనుగుణంగా మన విద్యారంగంలో మార్పులు తేవాలని కేంద్రం నిర్ణయించింది. చదువులకు తగ్గట్టు గ్రేడింగ్(లెవెల్స్) ఇవ్వాలని భావిస్తోంది. దీంట్లో భాగంగా గ్రేడింగ్స్ స్థాయులను సూచించే ‘నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్‌వర్క్’ విధానాన్ని కేంద్ర విద్యాశాఖ ప్రతిపాదించింది. ఎన్‌హెచ్‌ఈక్యూఎఫ్, యూజీసీ సంయుక్తంగా రూపొందించిన డ్రాఫ్ట్‌పై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరింది. స్టడీ, రీసెర్చ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, స్కిల్స్.. ఇలా పలు అంశాలకు విడివిడిగా లెవెల్స్ సూచిస్తారు. 1–4 వరకు ఉండే లెవల్స్‌లో స్కూల్ ఎడ్యుకేషన్, 5వ లెవెల్లో సాంకేతిక నైపుణ్యం, ఇన్వెస్టిగేటివ్ ఐడియాలను చేర్చారు. 6వ లెవెల్లో రీసెర్చ్ కు అవసరమైన టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను, 7వ లెవెల్లో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఎడ్యుకేషన్, 8లో టెక్నికల్ స్కిల్స్, డిజైన్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంశాలకు ఆ స్థాయిని చేర్చారు.