రిలీజ్‌‎కు రెడీ అయిన ‘35- చిన్న కథ కాదు’ మూవీ

 రిలీజ్‌‎కు రెడీ అయిన ‘35- చిన్న కథ కాదు’ మూవీ

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌‎‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్  ‘35- చిన్న కథ కాదు’.  రానా దగ్గుబాటి సమర్పణలో  సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ఆదివారం ప్రకటించారు. ఇదొక క్లీన్ ఫ్యామిలీ డ్రామా అని, ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‎తో పాటు ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని మేకర్స్ చెప్పారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌‎కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.