శ్రద్ధాదాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘త్రికాల’. స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. శనివారం ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను నిర్మాత దిల్ రాజు లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.
ఫాంటసీ, హారర్ ఎలిమెంట్స్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సముద్రంలో మునిగిపోయిన మనదేశానికి చెందిన ఒకప్పటి నగరం ‘కుమారి కండం’ ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని, మూల కథకు పురాణ నేపథ్యంతో పాటు సరికొత్త హంగులను అద్దుతూ తెరకెక్కించామని మేకర్స్ చెప్పారు. హ్యూజ్ బడ్జెట్‌తో, హై క్వాలిటీ గ్రాఫిక్స్‌తో సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా దీన్ని రూపొందించామని తెలియజేశారు. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో రాధికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీసాయి దీప్ చాట్ల, వెంకట్ రమేష్ దాడి, ఓంకార్ పవన్ సహ నిర్మాతలు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.