
22 వార్డుల్లో 11 మంది టీఆర్ ఎస్ అభ్యర్థుల ఏకగ్రీవం
రాష్ట్రవ్యాప్తంగా 79 వార్డులు యునానిమస్
టీఆర్ఎస్ కు 76 వార్డులు..ఎంఐఎంకు మూడు
ఎన్నికలకు ముందే వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మున్సిపాలిటీ దాదాపు టీఆర్‌ఎస్ ఖాతాలో పడింది. ఇక్కడ మొత్తం 22 వార్డులు ఉండగా, మంగళవారం నాటికి 11 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. సోమవారం నాటికి 6 వార్డులు ఏకగ్రీవం కాగా, మంగళవారం మరో ఐదింటిని ఏకగ్రీవం చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం కల్లా రాష్ట్రవ్యాప్తంగా 79 వార్డులు యునానిమస్ అయ్యాయి. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమదైన రాజకీయం నడిపి 76 వార్డులను ఏకగ్రీవంచేసుకున్నారు. మరో మూడు వార్డులు ఎంఐఎంకు దక్కాయి.
అధికారపార్టీ దెబ్బకు ప్రచారానికి ముందే ఇతర పార్టీలు, స్వతంత్రులు తప్పుకుంటున్నారు. సోమవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 42 వార్డులు ఏకగ్రీవం కాగా, వీటిలో 40 వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఉన్నారు. రెండు వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు పలుచోట్ల టీఆర్‌ఎస్‌కు మద్దతుగా అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. దీంతో పలు వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మంగళవారం మొత్తం 37 వార్డులు ఏకగ్రీవం కాగా, 36 వార్డులు టీఆర్ఎస్ కు, ఒక వార్డు ఎంఐఎంకు దక్కాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలి టీలో మంగళవారం మూడు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 5వ వార్డులో దర్నమ్ అరుణ, 36వ వార్డులో కల్లూరి రాజుజ, 19వ వార్డులో అన్నారం శ్రీనివాస్ ఏకగ్రీవమయ్యారు. వేములవాడ మున్సిపాలి టీలో 6వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి నీలం కళ్యాణి ఏకగ్రీవమయ్యారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 4వ వార్డు నుంచి మట్టా ప్రసాద్, 5వ వార్డులో నరుకుళ్ల మమత, 8వ వార్డులో షేక్ చాంద్ పాషా, 18వ వార్డులో షేక్ మౌలాలీలు టీఆర్‌ఎస్ తరుపున ఏకగ్రీవమయ్యారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో వాంకుడోతు వీరన్న 5వ వార్డు నుంచి ఏకగ్రీవమయ్యా రు. ఈ మున్సిపాలిటీకి టీఆర్‌ఎస్ నుంచి ఛైర్మన్ అభ్యర్థిగా వీరన్నను ప్రకటించారు. మరిపెడ మున్సిపాలి టీ 9వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి వీసారపు ప్రగతి ఏకగ్రీవమయ్యారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి కోరమోని వనజ ఏకగ్రీవమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపాలిటీలో 2వ వార్డు నుంచి సంధ్యారాణి అశోక్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. వికారాబాద్ మున్సిపాలిటీలో 25వ వార్డు నుంచి చిగుళ్లపల్లి మంజుల రమేష్, 14వ వార్డు నుంచి రామస్వామి ఏకగ్రీవమయ్యా రు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ 12వ వార్డులో బట్టు యాదమ్మ, హుస్నాబాద్ మున్సిపాలి టీలోని 15 వార్డు నుంచి ఆకుల రజిత, 13వ వార్డులో బొల్లు కల్పన ఏకగ్రీవమయ్యా రు.
నారాయణపేట్ జిల్లా కోస్గి మున్సిపాలిటీలో 10వ వార్డు నుంచి అనితా బాలరాజు ఏకగ్రీవమయ్యారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలి టీలోని 6వ వార్డులో గుండ్ల సుజాత, 12వ వార్డులో అర్రు బాలమణి రత్నం ఏకగ్రీవమయ్యారు. సదాశివపేట మున్సిపాలి టీ 5వ వార్డు నుంచి రజియా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ 7వ వార్డులో గూడూరి సబిత ఏకగ్రీవమయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలి టీ 28వ వార్డులో గందె రాధిక ఏకగ్రీవమయ్యారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీలో 26వ వార్డు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అన్నం లావణ్య, 29వ వార్డులో యాటం పద్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మున్సిపాలిటీ 5వ వార్డు నుంచి బాషా ఏకగ్రీవమయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ 4వ వార్డులో రుక్మిణి ఏకగ్రీవమయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ 2వ వార్డులో కమ్మల శ్రీనివాస్, 5వ వార్డులో నసీమా బేగం, 18వ వార్డు నుంచి గర్రెపల్లి శాంతారాణి ఏకగ్రీవమయ్యారు. నిర్మల్ మున్సిపాలిటీ 10వ వార్డులో కొండ సబిత ఏకగ్రీవమయ్యారు. భైంసా మున్సిపాలిటీ 16వ వార్డులో ఎంఐఎం నుంచి ముంతాజ్ ఏకగ్రీవమయ్యారు.