పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పేరు టీజీపిక్స్గా చేంజ్.. జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కార్

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పేరు టీజీపిక్స్గా చేంజ్.. జీవో జారీ చేసిన రాష్ట్ర సర్కార్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మారింది. ఇకపై దాన్ని ‘‘తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీపిక్స్)’’గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. కార్పొరేషన్ ఎండీ ఎం. రమేశ్ ఈ మార్పుపై వివరాలు వెల్లడించారు. 

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ప్రధానంగా సాంకేతికత ఆధారిత సేవలు, ఇంజినీరింగ్, ప్రాజెక్ట్ నిర్వహణ, డిజైన్ సేవలు, నిర్మాణ కార్యక్రమాలు, క్రీడా మౌలిక సదుపాయాలకు సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసెస్ అందిస్తుందన్నారు. ఈ కొత్త పేరు మార్పుతో కార్పొరేషన్ పరిధిని విస్తరించి, మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుందని రమేశ్ తెలిపారు. ఈ మార్పు శనివారం నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.