
రాజ్ తరుణ్ హీరోగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘తిరగబడర సామీ’. మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్. సోమవారం ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘రాజ్ తరుణ్ ఎక్స్‌ట్రార్డినరీ ఆర్టిస్ట్. ఇదొక ఎంటర్‌టైనర్ అనుకున్నా. కానీ టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ సినిమాలా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘డైరెక్టర్ రవికుమార్ చౌదరి నాలో కొత్త కోణాన్ని చూపించారు.
నేను ఫస్ట్ టైమ్ నటించిన కంప్లీట్ యాక్షన్ సినిమా ఇది. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చేలా ఉంటుంది’ అన్నాడు. మన్నారా చోప్రా మాట్లాడుతూ ‘మొదటిసారి నెగిటివ్ రోల్‌లో కనిపిస్తాను. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’ అని చెప్పింది. ‘ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్షన్ హీరో అవుతారు. తను డైరెక్టర్ ఆర్టిస్ట్. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు మళ్ళీ రీ బర్త్ ఇస్తున్న మా నిర్మాత శివకుమార్ గారికి థ్యాంక్స్’ అని చెప్పాడు రవికుమార్ చౌదరి. ‘దిల్ రాజు గారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్స్‌ని మొదలుపెట్టడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాత శివకుమార్. బెక్కం వేణుగోపాల్, దర్శకుడు సముద్ర, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు.