‘గుంటూరు కారం’లో విలన్ల పేర్లను తొలగించాలి

‘గుంటూరు కారం’లో విలన్ల పేర్లను తొలగించాలి

ముషీరాబాద్, వెలుగు: గుంటూరు కారం సినిమాలో విలన్ల పాత్రలకు పెట్టిన మార్క్స్, లెనిన్ పేర్లను తొలగించాలని వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే థియేటర్లు, త్రివిక్రమ్ ఆఫీసును ముట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద త్రివిక్రమ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కమిటీ నేతలు నాగరాజు, పుట్ట లక్ష్మణ్, నాగేశ్వరరావు, రామకృష్ణ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.