‘మీకు అంత అర్జెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లండి’.. ప్రభుత్వ ఆసుపత్రిల్లో నిర్లక్ష్యం

 ‘మీకు అంత అర్జెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లండి’.. ప్రభుత్వ ఆసుపత్రిల్లో నిర్లక్ష్యం

వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్య బయట పడింది. డాక్టర్లు ఇచ్చిన నిర్లక్ష్యపు వైఖరికి అసంతృప్తి వ్యక్తం చేసిన పేషెంట్లు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు. హెల్త్ చెకప్ చేసుకొని నాలుగు రోజులు గడుస్తున్నా... రిపోర్ట్ ఇవ్వట్లేదని పేషెంట్లు ఆరోపించారు. రిపోర్ట్ ల గురించి అడిగితే సిబ్భంది నిర్లక్షపు సమాధానం చెప్తున్నారని మండి పడ్డారు. వైద్యులు రాసిన స్కానింగ్ కు కూడా రెండు వారాల తర్వాత రమ్మని డిమాండ్ చేస్తున్నారని పేషెంట్లు తెలిపారు.

రిపోర్ట్ లు ఇచ్చే సమయంలో కూడా సర్వర్ ప్రాబ్లం ఉందంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారని, పురుషులు, స్త్రీలకు ఒకే రూముల్లో టెస్టులు జరుపుతున్నారని పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే.. అర్జెంట్ గా ఉంటే ప్రైవేట్ టెస్ట్ సెంటర్ లకు వెళ్లాలంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్నారని సిబ్భందిపై పేషెంట్లు ఆరోపించారు.