ఫస్టియర్ సంస్కృతంలో 3 ప్రశ్నలు రిపీట్

ఫస్టియర్ సంస్కృతంలో 3 ప్రశ్నలు రిపీట్

హైదరాబాద్, వెలుగు : ఇంటర్ పరీక్షల్లో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. తొలిరోజు జరిగిన ఫస్టియర్ సంస్కృతం పరీక్షలో ఒకటీ, రెండు కాదు ఏకంగా 3 ప్రశ్నలు రిపీట్ అయ్యాయి. 12, 13 క్వశ్చన్లు రెండు మార్కుల సంధులకు చెందినవిగా ఇచ్చారు. దీంట్లో 12వ ప్రశ్నలో 12 సబ్ క్వశ్చన్స్ ఇచ్చి వాటిలో 4 జవాబులు రాయమన్నారు. దీంట్లో ‘పరమేశహ్’ అనే ప్రశ్న రెండుసార్లు వచ్చింది. ఇక 13వ ప్రశ్నలో 12 సబ్ క్వశ్చన్లలో ‘గజా+ఆనహా’, ‘నర+ఇంద్రహా’ అనే ప్రశ్నలు రెండుసార్లు వచ్చాయి. దీంతో స్టూడెంట్లు, లెక్చరర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరబిక్ మీడియం క్వశ్చన్​ పేపర్​లో క్వశ్చన్ నెంబర్ 4లో మార్కుల గణన 2*4=8కు బదులు 2*2=8 అని పడింది. క్వశ్చన్ నెంబర్ 11లోని 5 క్వశ్చన్​కు 4 అని పడింది.

తొలిరోజు 22 వేల మంది డుమ్మా
తొలిరోజు శుక్రవారం ఫస్టియర్ స్టూడెంట్లకు.. సెకండ్ లాంగ్వేజీ పరీక్ష జరిగింది. మొత్తం 4,64,756 మందికి గాను 4,42,546 మంది హాజరయ్యారు. 22,210 (4.7%) మంది పరీక్షకు హాజరు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి.