హుస్సేన్ సాగర్ లో పడిన కొత్త కారు

హుస్సేన్ సాగర్ లో పడిన కొత్త కారు

హుస్సేన్ సాగర్ లోకి ఓ కొత్త కారు దూసుకెళ్లింది. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్ , కార్తీక్ లు ముగ్గురూ అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి బయలుదేరారు. ఎన్టీఆర్ పార్క్ వద్దకు రాగానే అదుపుతప్పిన కారు ట్యాంక్ బండ్ లోకి వెళ్లింది.  కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని.. క్షతగాత్రులను సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ట్యాంక్ బండ్ లో పడిన కారు నాలుగు రోజుల క్రితమే కొనడం గమనార్హం.