ఇంద్ర భవనంలా కొత్త యూఎస్ కాన్సులేట్.. ఖర్చు ఎంతంటే

ఇంద్ర భవనంలా కొత్త యూఎస్ కాన్సులేట్.. ఖర్చు ఎంతంటే

భాగ్యనగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. నానక్ రాంగూడలో యూఎస్ కాన్సులేట్ నూతన కార్యాలయం ప్రారంభం అయింది. బేగంపేట్ నుంచి నానక్ రాంగూడ్ లో కొత్తగా కట్టిన ఈ కార్యాలయానికి మారిన తర్వాత, తమ పూర్తి సేవలు అందిస్తున్నామని యూఎస్ కాన్సులేట్ అధికారులు వెల్లడించారు. 

కాన్సులేట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో మొదటి యూఎస్ పాస్ట్ పోర్ట్ ను జారీ చేసినట్లు ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ భవనాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మించారు.  కొత్త కాన్సులేట్‌ ద్వారా తెలంగాణతో పాటు ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించనున్నారు. 

భారత్ లో ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ కాకుండా వీసా కార్యకలాపాలు, దౌత్య కార్యకలాపాల కోసం దేశవ్యాప్తంగా నాలుగు కాన్సులేట్ లు ఉన్నాయి. వీటన్నింటిలో అతిపెద్దదిగా ఇప్పుడు హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ గుర్తింపు పొందింది.

ఈ భవనం నిర్మించడానికి 340 మిలియన్ యూఎస్ డాలర్స్ (రూ.2800 కోట్లు) ఖర్చయ్యాయి. దాదాపు 12.2 ఎకరాల విస్తీర్ణంలో కాన్సులేట్ ను నిర్మించారు. అమెరికా స్టూడెంట్ వీసాలు పెరుగుతున్న కారణంగా ఈ కొత్త భవనాన్ని నిర్మించాలని అమెరికా విదేశాంగ శాఖ 2017లో ఈ భవన నిర్మానానికి ప్రతిపాదించింది.