రాజాసింగ్కు పోలీసుల నోటీసులపై త్వరలోనే సమాధానమిస్తం : కరుణ సాగర్

రాజాసింగ్కు పోలీసుల నోటీసులపై త్వరలోనే సమాధానమిస్తం : కరుణ సాగర్

ఎమ్మెల్యే రాజా సింగ్కు పోలీసులు జారీ చేసిన నోటీసులపై త్వరలోనే సమాధానం ఇస్తామని అడ్వకేట్ కరుణసాగర్ తెలిపారు. పోలీసులు ఆరోపించినట్లు రాజాసింగ్ ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్నారు. పోలీసులు అధికార దుర్వినియోగంతోనే నోటీసులు జారీ చేశారని అన్నారు. తాను ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెడితేనే పోలీసులు నోటీసులు జారీ చేయడం దురదృష్టకరమని రాజాసింగ్ అన్నారు. సీఎం కేసీఆర్, పోలీసులు తనపై దృష్టి పెట్టారనడానికి  ఇదే నిదర్శనమన్నారు.

హైకోర్టు ఆదేశాలు పాటించకుండా రాజా సింగ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశారంటూ మంగళ్హాట్ పోలీసులు నోటీసులు ఆయనకు జారీ చేశారు. రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే పీడీ యాక్ట్ కేసులో అరెస్టైన రాజాసింగ్ కు హైకోర్టు కొన్ని షరతులతో జైలు నుంచి బయటకు పంపింది.  జైలు నుంచి విడుదలైన తర్వాత ఎలాంటి విద్వేష వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. మీడియాతోనూ మాట్లాడొద్దని సూచించింది.