
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ సబ్స్క్రయిబర్ల సంఖ్య సెప్టెంబర్ నెలలో 36 లక్షల మేర తగ్గిపోయింది. వోడాఫోన్ ఐడియా (వీ) సెప్టెంబర్ నెలలోనూ కస్టమర్లను పోగొట్టుకుంది. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు మాత్రం తమ కస్టమర్లను పెంచుకున్నాయి. ఈ నెలలో జియోకి కొత్తగా 7.2 లక్షల మంది కస్టమర్లు రాగా, భారతి ఎయిర్‌టెల్‌కు 4.12 లక్షల మంది కొత్త కస్టమర్లు దొరికారు. సెప్టెంబర్ నెలలో వోడాఫోన్ ఐడియా తన సబ్స్క్రయిబర్లలో 40 లక్షల మందిని పోగొట్టుకుంది. దీంతో ఆ కంపెనీ కస్టమర్ల సంఖ్య 24.91 కోట్లకు తగ్గిపోయినట్లు ట్రాయ్ వెల్లడించింది. ఆగస్టు నెలలో 114.9 కోట్ల మంది వైర్లెస్ సబ్స్క్రయిబర్లుండగా, సెప్టెంబర్ నాటికి ఈ సంఖ్య 114.5 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంటే 0.32 శాతం తగ్గింది.