2019లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య లక్షా 54 వేల 732

2019లో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య లక్షా 54 వేల 732

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఏటా దేశంలో రోడ్డు యాక్సిడెంట్లలో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్‌‌‌‌ రూల్స్‌‌‌‌ పాటించకుండా ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్ తో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క 2019 లోనే ఇలా రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయిన వారు 1, 54, 732 మంది. గతేడాది దేశ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలను మంగళవారం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. గతేడాది దేశ వ్యాప్తంగా 4, 37, 396 యాక్సిడెంట్లు జరిగాయి.  వీటిల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే 2,60,379 యాక్సిడెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1,77,017 ప్రమాదాలు జరిగినట్లు తెలిపింది. ఇందులో 1,30,943 యాక్సిడెంట్లు రెసిడెన్షియల్ ఏరియాల్లో అయ్యాయి. ఓవర్ స్పీడ్ కారణంగానే 59.6 శాతం యాక్సిడెంట్స్‌‌‌‌ జరగగా అందులో 86,241 మంది చనిపోయారు. మరో 2,71,581 మంది వాహనదారులు గాయపడ్డారు. డేంజరస్‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌ కారణంగా జరిగిన ప్రమాదాల్లో 42,557 మంది చనిపోయారు. 1,06,555 మంది గాయపడ్డారు.

మన రాష్ట్రంలో 6, 964 మంది మృతి

గతేడాది లో యాక్సిడెంట్ల కారణంగా తెలంగాణలో 6, 964 మంది చనిపోయారు. మొత్తం 21, 570 యాక్సిడెంట్లు అయినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో తెలిపింది. దాదాపు 22 వేల మంది గాయపడ్డారు. ఓవర్ స్పీడ్, రాష్ డ్రైవింగ్ నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.