హైదరాబాద్ కు పెరుగుతున్న టూరిస్ట్ లు

హైదరాబాద్ కు పెరుగుతున్న టూరిస్ట్ లు

హైదరాబాద్, వెలుగు: సిటీలోని చారిత్రక కట్టడాలు, ఇతర పర్యాటక ప్రాంతాలను  చూసేందుకు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి సైతం టూరిస్టులు వస్తుంటారు. కరోనా టైమ్​లో ఢీలా పడ్డ పర్యాటక రంగం మళ్లీ మాములు స్థితికి చేరుకుంటోంది. కొన్ని నెలల నుంచి సిటికి వస్తున్న టూరిస్టుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో టూరిజం హోటళ్లు కూడా ఫుల్ అయిపోతున్నాయని అధికారులు చెప్తున్నారు. శని, ఆదివారాల్లో మరింత రద్దీగా ఉంటుందంటున్నారు.

చారిత్రక కట్టడాలను చూసేందుకు..

మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి సిటీకి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నట్లు టూరిజం డిపార్ట్​మెంట్ అధికారులు చెప్తున్నారు. చార్మినార్, గోల్కొండ, చౌ మహల్లా ప్యాలెస్,  సాలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్కును డైలీ వందల సంఖ్యలో టూరిస్టులు సందర్శిస్తునారు. వీకెండ్ లో ఈ సంఖ్య వేలల్లో ఉంటోందంటున్నారు. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, లుంబిని పార్క్, ఎన్జీఆర్ గార్డెన్, హుస్సేన్ సాగర్ బోటింగ్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సైతం సందర్శకుల సంఖ్య పెరిగిందని అధికారులు చెప్తున్నారు. 

వన్ డే టూర్ ప్యాకేజీ..

సిటీ టూరిజానికి బేగంపేటలోని  ప్లాజా హోటల్, తారామతి బారాదరిలో హోటల్స్ ఉన్నాయి. తారామతి బారాదరిలో 32 రూమ్స్,  బాంకెట్ హాల్స్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్, ఔట్ డోర్ ఆడిటోరియంలు అందుబాటులో ఉన్నాయి. బేగంపేటలోని ప్లాజా హోటల్‌‌‌‌లో 70 రూమ్స్‌‌‌‌తో పాటు రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, బాంకెట్ హాల్ ఉంది.  ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్న వారు ముందుగానే బుకింగ్ చేసుకుంటున్నారని, వీకెండ్స్‌‌‌‌లో  రూమ్‌‌‌‌
లన్నీ ఫుల్ అయిపోతున్నాయని అధికారులు అంటున్నారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి బస్సు, గైడ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని చెప్తున్నారు. సిటీలో వన్ డే టూర్ ప్యాకేజీలతో పర్యాటకులు చూడాలనుకున్న ప్రదేశాలన్నీ టూరిస్ట్ గైడ్​ను ఏర్పాటు చేసి చూపిస్తున్నామంటున్నారు. దీంతో ఆయా ప్యాకేజీలను తీసుకుని టూరిస్టులు సిటీ మొత్తాన్ని చుట్టేస్తున్నారు.