విద్యార్థులు  లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో 

విద్యార్థులు  లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి : సబ్ కలెక్టర్ వికాస్ మహతో 

బోధన్,వెలుగు: విద్యార్థులు నిర్దేశిత లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో సూచించారు. బోధన్ పట్టణంలోని రవి గార్డెన్ లో ఉషోదయ జూనియర్, మహిళా జూనియర్ కాలేజీ 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహతో ముఖ్య​తిథిగా వచ్చి మాట్లాడుతూ విద్యార్థుల  భవిష్యత్తు తమ చేతుల్లోనే ఉంటుందన్నారు. కష్టపడి   చదివితే సాధించలేనిది లేదన్నారు.

ఏదైనా సాధించాలంటే  ఇష్టంతే చదవాలని, ప్రతి ఒకటి నేగిటివ్ ఆలోచనతో చూడకుండా పాజిటివ్​ ఆలోచనతో ముందుకు సాగలన్నారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకులోను కాకుండా, క్రమ శిక్షణతో మెలగాలన్నారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. త ఈకార్యక్రమంలో కాలేజీ చైర్మన్ సూర్య ప్రకాశ్​, డైరెక్టర్లు దుష్యంత్,రమణి, సునిత, కాలేజీ ప్రిన్సిపాల్స్ ఆనంద్ రెడ్డి, ప్రసాద్, విద్యార్థులు  పాల్గొన్నారు.