నిజామాబాద్, వెలుగు: టెన్త్, ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, అక్రమాలకు తావు ఇవ్వొదన్నారు. బుధవారం ఆమె కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్‌లో మాట్లాడారు. ఈ నెల 25 నుంచి ఇంటర్ ఫైనల్ పరీక్షలు జరుగనుండగా ఫస్ట్ ఇయర్ 19,299, సెకెండ్ ఇయర్ 17,664 కలిపి మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం అరెంజ్మెంట్స్ చేయాలన్నారు.
మార్చ్ 14 నుంచి షురువయ్యే టెన్త్ ఎగ్జామ్స్ జిల్లాలో 24,542 మంది రాయనున్నారని ఇందులో 143 ప్రైవేట్ స్టూడెంట్స్ ఉన్నట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాల విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ఆన్సర్ షీట్స్ పట్ల కూడా అంతే అప్రమత్తత కనబర్చాలన్నారు. క్లీన్ వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని ఆశావర్కర్లు, ఏఎన్ఎంల సేవలు తీసుకోవాలన్నారు. పరీక్షలు జరిగే టైంకు బస్‌లు నడిచేలా ప్లాన్ చేయాలని, సెంటర్లకు చేరువలోని జిరాక్స్ సెంటర్లు క్లోజ్ చేయించాలని, సెల్ఫోన్లు అనుమతించొద్దన్నారు. ఎక్కడ పొరపాట్లు జరిగినా సంబంధిత ఆఫీసర్లను బాధ్యులను చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్, జిల్లా ఇంటర్మీడియేట్ ఆఫీసర్ రవికుమార్, డీఈవో అశోక్, ఏసీపీ మస్తాన్అలీ ఉన్నారు.
సాలూరా తహసీల్దార్‌కు నోటీస్
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను ఏ మాత్రం అనుమతించమని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాలూరా మండలంలో రెండు ఇసుక వాహనాలు పట్టుబడడాన్ని సీరియస్‌గా పరిగణించి అక్కడి తహసీల్దార్ శశిభూషణ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశామని బుధవారం ఒక ప్రకటలో వెల్లడించారు. పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇసుక ట్రాన్స్‌పోర్టు చేస్తే తహసీల్దార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలన్నారు.
