రాత్రి వేళ్ల లో గస్తీ ముమ్మరం  కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర

రాత్రి వేళ్ల లో గస్తీ ముమ్మరం  కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర

కామారెడ్డి​, వెలుగు :  రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్​​ చంద్ర పేర్కొన్నారు.   బుధవారం   జిల్లా పోలీసు ఆఫీసులో నెలవారీ క్రైం రివ్యూ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ..    రాత్రి వేళల్లో దొంగతనాలు జరగకుండా గస్తీ ముమ్మరం చేయటంతో పాటు  బీట్లను పెంచాలన్నారు.   ప్రజల ఆస్తుల రక్షణ లక్ష్యంగా పని చేయాలన్నారు.   నేరాల  నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.  

ఆరైవ్​ అలైవ్​  ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.    పెండింగ్​లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.  కేసుల దర్యాప్తులో క్వాలిటీ ముఖ్యమన్నారు.  రంజాన్​   దృష్ట్యా  మత సామరస్యంతో పాటు శాంతియుతంగా పండుగ జరుపుకునేలా చూడాలన్నారు.  అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి,  డీఎస్పీలు శ్రీనివాస్​రావు, విఠల్​రెడ్డి,  సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.