తాగి వాహనం నడిపిన వ్యక్తికి  రూ.10 వేల జరిమానా... ఆరు నెలల పాటు లైసెన్స్ రద్దు

తాగి వాహనం నడిపిన వ్యక్తికి  రూ.10 వేల జరిమానా... ఆరు నెలల పాటు లైసెన్స్ రద్దు

వర్ని,వెలుగు:  మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తికి రూ. 10 వేలు జరిమానాతో పాటు ఆరు నెలల పాటు లైసెన్స్​ రద్దయినట్లు ఎస్​ఐ సాయన్న తెలిపారు. ఎస్​ఐ తెలిపిన వివరాల ప్రకారం..   రుద్రూర్ శివారులో ఎస్సై సాయన్న  ఆధ్వర్యంలో  వాహనాల  తనిఖీలు నిర్వహిస్తుండగా.. నందిపేట్​ మండలం చీమరాజు పల్లికి చెందిన గుమ్మల దేవేందర్​  మద్యంసేవించి కారు నడుపుతూ వచ్చి, దొరికాడు.    

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి బుధవారం మేజిస్ట్రేట్ ముందర హజరుపరిచారు. దీంతో మేజిస్ట్రేట్ శేషతల్ప సాయి రూ.10 వేలు జరిమానా విధించి, ఆరు నెలల పాటు అతని లైసెన్స్ ను రద్దు చేసినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై సాయన్న పేర్కొన్నారు.