నందిపేట మండల కేంద్రంలోని బర్కత్‌‌‌‌‌‌‌‌పురా కాలనీ లో పట్టపగలే ఇంట్లో చోరీ

నందిపేట మండల కేంద్రంలోని బర్కత్‌‌‌‌‌‌‌‌పురా కాలనీ లో పట్టపగలే ఇంట్లో చోరీ

నందిపేట, వెలుగు: నందిపేట మండల కేంద్రంలోని బర్కత్‌‌‌‌‌‌‌‌పురా కాలనీలో బుధవారం పగటిపూటే దొంగతనం జరిగింది. మహమూద్   ఇంట్లో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో  దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాను పగులగొట్టి అందులోని సుమారు 10 తులాల బంగారం, ఒక లక్ష రూపాయల నగదును దోచుకెళ్లారు.

 ఇంటికి తాళం వేసి పక్క ఇంటికి వెళ్లి వచ్చేలోపు దొంగలు పడ్డారని మహమూద్​ భార్య ఆవేదన చెందారు.   ఎప్పుడూ జనసందడిగా ఉండే కాలనీలో పగటిపూట దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు సంఘటనా స్థలానికి  చేరుకొని,  క్లూస్​టీం అధికారులు వేలిముద్ర లు  సేకరించారు. పోలీస్​ జాగిలంతో గాలింపు చేపట్టారు.  కేసు దర్యాప్తులో ఉంది.