చెన్నూరులో స్ట్రాంగ్ రూమ్కు తరలించని ఈవీఎంలు.. అధికారుల తీరుపై కాంగ్రెస్ శ్రేణుల అనుమానాలు

చెన్నూరులో స్ట్రాంగ్ రూమ్కు తరలించని ఈవీఎంలు.. అధికారుల తీరుపై కాంగ్రెస్ శ్రేణుల అనుమానాలు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్ల నుండి స్ట్రాంగ్ రూమ్ కు EVM లను అధికారులు తరలించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల అధికారుల తీరుపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఈవీఎంలను తరలించడం లేదని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 

వివిధ మండలాల్లోని చాలా పోలింగ్ స్టేషన్ వద్ద సెంట్రల్ ఫోర్స్ భద్రత కనిపించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈవీఎంల తరలింపు ఆలస్యంపై మంచిర్యాల డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్‌ స్పందించి... భీమారం చేరుకున్నారు.