పెన్షన్ కోసం వృద్దురాలు ఆవేదన

పెన్షన్ కోసం వృద్దురాలు ఆవేదన

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లిలో... పెన్షన్ రావడం లేదంటూ ఎల్లవ్వ అనే వృద్దురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త చనిపోయి మూడేళ్లు అవుతున్నా.. వితంతు పెన్షన్ ఇవ్వడం లేదని కన్నీరు పెట్టుకుంది. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. 85ఏళ్ల వయస్సులో ఎలాంటి కష్టం చేయలేనని.. పెన్షన్ ఇచ్చి ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంది. తన ఆవేదనను స్థానిక యువకుల సాయంతో వీడియో విడుదల చేసింది ఎల్లవ్వ.