చిరుత చిక్కలే: పాద ముద్రలు గుర్తించారు

చిరుత చిక్కలే: పాద ముద్రలు గుర్తించారు

చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
చిలుకూరు ఫారెస్ట్​ ఏరియాలో ఉన్నట్లు అధికారుల డౌట్

హైద‌‌‌‌‌‌‌‌రాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మైలార్‌‌‌‌దేవ్​పల్లిలో కలకలం రేపిన చిరుత జాడ కరువైంది. పట్టుకునేందుకు గురువారం నుంచి ట్రై చేస్తున్న ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా తిరుగుతోంది. శుక్రవారం రాత్రి చిలుకూరు ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లినట్లు వాళ్లు అనుమానిస్తున్నారు. కాటేదాన్‌‌ నుంచి హిమాయత్​సాగర్‌‌‌‌, కవ్వగూడ, అజీజ్‌‌నగర్‌‌‌‌, మొయినాబాద్, చిలుకూరు పరిసరాల్లో  తిరుగుతున్నట్లు పాద ముద్రలు గుర్తించారు. శుక్రవారం రాత్రి కవ్వగూడలో చూశానని ఓ రైతు, శనివారం ఉదయం అజీజ్‌‌నగర్‌‌‌‌ పొలాల్లో చూశానని కిష్టయ్య అనే మత్స్యకారుడు సమాచారమిచ్చారు. దాంతో అధికారులు అనుమానిత ప్రాంతాల్లో వలలు, మాంసం, బోన్లు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తం ఉండాలని సూచించారు. రాత్రిళ్లు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి