రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై ప్రతిపక్షాల ఆగ్రహం

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై ప్రతిపక్షాల ఆగ్రహం

రాష్ట్రంలో పాలన కుప్పకూలిపోయింది : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలన కుప్ప కూలిపోయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. మంగళవారం టెన్త్​ హిందీ క్వశ్చన్ ​పేపర్ లీక్ కావడంపై అరుణ స్పందిస్తూ ప్రెస్​నోట్​ రిలీజ్​ చేశారు. టీఎస్​పీఎస్సీ, మొన్న పదో తరగతి తెలుగు, హిందీ ప్రశ్నపత్రం లీక్ అయినా సర్కారు మాత్రం దున్నపోతు మీద వానపడ్డట్లు తయారైందని విరుచుకుపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఎవరి శాఖకు ఎవరు మంత్రో అర్థం కావట్లేదన్నారు. అన్ని శాఖలకు తానే రాజు తానే మంత్రి అన్నట్లుగా స్పందించే కేటీఆర్..  ప్రశ్నపత్రాల వరుసగా లీకులపై ఎందు కు స్పందించట్లేదని ప్రశ్నించారు. సీఎం, మం త్రులు ప్రభుత్వ అధికారులపై పట్టు కోల్పోయా రని ఆందోళన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వానికి  చీమ కుట్టినట్లైనా లేదా? : బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, కె.లక్ష్మణ్ డిమాండ్   

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎగ్జామ్​ పేపర్ల లీకేజీలతో విద్యార్థులు, యువత జీవితాలు ఆగమైపోతుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మంగళవారం వారిద్దరూ రెండు వేర్వేరు ప్రకటనలు రిలీజ్ చేశారు. మొన్న టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు ప్ర శ్నార్థకం అయిందని, ఇప్పుడు టెన్త్ పేపర్ల వరుస లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. ఎన్ని విమర్శలొచ్చినా, ఎవరెన్ని రకాలుగా చెప్పినా కేసీఆర్ మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. రాజకీయాలపై ఉన్న శ్రద్ధ విద్యార్థు లపై, నిరుద్యోగులపై లేకపోవడం దారుణమన్నారు.

  • దేశ ఎన్నికలకు ఖర్చుపెట్టే అంత డబ్బు నీకెక్కడిది?
  • 2014కు ముందు నీ ఆస్తులెన్ని? : సీఎం కేసీఆర్​ను ప్రశ్నించిన పొన్నాల

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని కేసీఆర్​ దోచుకున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. దేశ ఎన్నికల ఖర్చు భరిస్తానని కేసీఆర్​ అన్నట్లు ఓ ప్రముఖ జర్నలిస్ట్​ చెప్పారని పొన్నాల పేర్కొన్నారు. ‘‘2014కు ముందు కేసీఆర్​ ఎవరు? అప్పుడు లేని ఫాంహౌస్​ ఇప్పుడెలా వచ్చింది? ఎన్నికల అఫిడవిట్​లో కేసీఆర్​ పేర్కొన్న ఆస్తుల వివరాలు అందరికీ తెలు సు. ప్రతిపక్ష కూటమికి చైర్​పర్సన్​ చేస్తే.. ఎన్నికలకు ఖర్చుపెట్టేంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి?” అని నిలదీశారు. మంగళవారం గాంధీ భవన్​లో మీడియాతో పొన్నాల మాట్లాడారు.

దేశంలోనే కేసీ ఆర్​ అత్యంత అవినీతిపరుడని ఆరోపిస్తున్న మోడీ, అమిత్​షా ఆయనపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలు ఇప్పుడు బీజేపీ క నుసన్నల్లోనే పని చేస్తున్నాయన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్​ తీసుకొస్తే.. దానిని సవరించాల్సిం దిపోయి లొసుగులను వాడుకుని 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టిందని పొన్నాల మండిపడ్డారు.

  • ఎన్నికలకు ఖర్చు పెట్టేంత సొమ్ము కేసీఆర్​ ఎలా సంపాదించారు?
  •    ఎంక్వైరీ చేయాలని సీఈసీకి : కాంగ్రెస్​ నేత నిరంజన్ లేఖ 

హైదరాబాద్, వెలుగు: 2024 ఎన్నికలకు ఖర్చు పెట్టేంత సొమ్ము కేసీఆర్​ఎట్లా సంపాదించారని పీసీసీ సీనియర్​ వైస్​ ప్రెసిడెంట్​ జి. నిరంజన్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్​కు లేఖ రాశారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమికి చైర్మన్​గా ఉంటాననడం, ఎన్నికల ఖర్చు పెట్టుకుంటాననడం కేసీఆర్​అవినీతికి పరాకాష్ట అన్నారు. అడ్డగోలు అవినీతితో సం పాదించిన సొమ్ముతో దేశ రాజకీయాలను  నడపాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. కేసీఆర్​ మాటలు వినాశకాలే వి పరీత బుద్ధి అన్నట్టుగా ఉన్నాయన్నారు.

సగం హామీలు కూడా కేసీఆర్ నెరవేర్చలేదు : కాంగ్రెస్ నేత మల్లు రవి

హైదరాబాద్​, వెలుగు: గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో సగం కూడా కేసీఆర్​ నెరవేర్చలేదని పీసీసీ సీనియర్ ​వైస్​ ప్రెసిడెంట్ ​మల్లు రవి ఆరోపించారు. కేసీఆర్​ది లీకేజీ పాలనని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా ఖాళీగా కూర్చొని ఎలక్షన్ ఇయర్ కావడంతో ఆదరాబాదరాగా ఒకే సారి ఎక్కువ నోటిఫికేషన్లు ఇచ్చారని తెలి పారు. అందుకే టీఎస్ పీఎస్సీ పేపర్లు లీక య్యాయని వెల్లడించారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. లీకేజీ జరిగిన రెండు వారాల తర్వాత కమిషన్ ​చైర్మన్, మెంబర్లను విచా రించడమేమిటని ప్రశ్నించారు. ప్రతిపక్ష కూటమికి ఎన్నికల ఖర్చంతా పెట్టుకునే స్తోమత కేసీఆర్​కు ఎక్కడిదని ప్రశ్నించా రు. జర్నలిస్ట్ రాజ్​దీప్​ సర్దేశాయి చేసిన కామెంట్లను కేసీఆర్​ ఖండించలేదన్నారు.