
సినీ ఇండస్ట్రీని సంబరాల్లో ముంచెత్తిన 95వ ఆస్కార్ వేడుకలు ముగిశాయి. భారత కాలామానం ప్రకారం మార్చి 13న ఉదయం 5:30 కు మొదలైన ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవం.. ఉదయం 9గంటలకు ముగిశాయి. ఈ వేడుక కోసం ప్రపంచ దేశాలకు ఆథిద్యం ఇచ్చే దగ్గరనుంచి వేడుకలు జరిపే వరకు దాదాపే 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.463,92,47,300 అన్నమాట. ఇందులో ప్రెసెంటర్ గా వ్యవహరించిన నటి వేసుకున్న డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్లు. వీటితోపాటు ఆస్కార్ ఈవెంట్లో ఎవరైనా యాడ్ ఇవ్వాలంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్ డాలర్స్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో రూ.16,39,31,000.
ఈసారి ఆస్కార్ వేడుకల కోసం కొన్ని కీలక మార్పులు చేశారు. ప్రతీసారి అతిథులు రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వచ్చేవాళ్లు. దాన్ని ఈసారి మార్చారు. రెడ్ బదులుగా షాంపైన్ రంగును వాడారు. 95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో మొదటిసారి కార్పెట్ రంగు మార్చారు. 50,000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24,700 డాలర్స్ ఉంటుంది.