కరోనా అని ఓనర్ వెళ్లగొట్టిండు

కరోనా అని ఓనర్ వెళ్లగొట్టిండు

కష్టాల్లో టాక్సీ డ్రైవర్ కుటుంబం
నర్సంపేట, వెలుగు: కరోనా వచ్చిన వారిని దాదాపుగా వెలి వేసినట్లు చూస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు చెందిన టాక్సీ డ్రైవర్ కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. శాంతినగర్ లోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. టాక్సీ డ్రైవర్, అతని కూ తురుకు పాజిటివ్ రావడంతో హోం క్వారంటైన్ లోనే ఉండాలని ఈ నెల 17న డాక్టర్లు చెప్పారు. దీంతో ఓ రేకుల షెడ్డులో ఆశ్రయం తీసుకున్నారు. భార్య, కొడుకుకు 18న పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికీ పాజిటివ్ వ‌చ్చిందని 20న తెలిపారు. విషయం తెలిసి ఓనర్ ఇల్లు ఖాళీ చేయించాడు. దాంతో వారూ రేకుల షెడ్డులోకి వెళ్లారు. అక్కడ నీళ్లుకూడా లేవని కుటుంబీకులు వాపోతున్నారు. కూరగాయలు, నీటి కోసం 48 గంటలుగా నరకయాతన పడుతున్నామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..