బీజేపీ ధర్నాకు అనుమతివ్వండి

బీజేపీ ధర్నాకు అనుమతివ్వండి
  • సీపీ సీవీ ఆనంద్ కు బీజేపీ నేతల వినతిపత్రం

హైదరాబాద్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల సమస్యపై ఈనెల 25న ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ  ధర్నా చేపట్టనుంది.  ఈ ధర్నాకు అనుమతి ఇవ్వాలని  సీపీ సీవీ ఆనంద్ ను బీజేపీ నేతలు గురువారం పర్మిషన్  కోరారు.  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి,   మాజీ ఎమ్మెల్యేలు  చింతల రాంచంద్రారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ఎన్ వీ వీఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ సీపీను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు చేపట్టనున్న 

ఈ ధర్నాకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి అటెండ్ అవుతారని తెలిపారు. కాగా, బాటసింగరంలో గురువారం  బీజేపీ తలపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల సందర్శన సందర్భంగా హార్ట్ అటాక్ గురై  హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న  శివ అనే కార్యకర్తను కిషన్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. అండగా ఉంటానని శివ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చారు.