
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan), ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish shankar) కాంబోలో వస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్(Usthad bhagathsingh).రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్.
ఇవాళ (సెప్టెంబర్ 7న) ఈ మూవీ కొత్త షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ షెడ్యూల్లో పవన్ పాల్గొన్నట్లు..ఇందుకోసం పవర్ ప్యాక్డ్ సీన్స్ షూట్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పవన్ నుంచి భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని ఫ్యాన్స్ మస్త్ ఖుషి అవుతున్నారు.
ఇక రీసెంట్గా హరీష్ శంకర్ కత్తులు, ఆయుధాలతో ఉన్న ఫొటోస్ ను తన ట్విట్టర్ నుంచి షేర్ చేసిన విషయం తెలిసందే. ఇందుకోసం పవన్ కళ్యాణ్ 15 రోజులు డేట్స్ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న..తాజా షెడ్యూల్ లోనే పవర్ స్టార్కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ మరోసారి పోలీస్ పాత్రలో తన పవర్ చూపించడానికి రెడి అయ్యాడు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయనుందో చూడాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
The USTAAD is back in action ❤️?❤️?@PawanKalyan has joined the sets of #UstaadBhagatSingh for a MASSive schedule and is shooting some power-packed scenes ?
— Mythri Movie Makers (@MythriOfficial) September 7, 2023
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth pic.twitter.com/2zDurRJdEb