కరెంట్ సమస్యలతో రైతుల కష్టాలు: నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు

కరెంట్ సమస్యలతో రైతుల కష్టాలు: నీళ్లు లేక ఎండిపోతున్న పొలాలు

సిద్దిపేట జిల్లా : చేర్యాల మండలం ఆకునూరులో కరెంట్ సమస్యతో రైతులు కష్టాలు పడుతున్నారు. 30మంది రైతుల పొలాలకు కలిపి ఒకే ట్రాన్స్ ఫార్మర్ ఉండటంతో.. అది తరచూ కాలిపోతోంది. దీంతో నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పంట వేస్తే కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.  ట్రాన్స్ ఫార్మర్ కోసం టీడీఎస్ లు కట్టినా.. అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు.

వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయాలని..లేదంటే తమ కష్టం అంతా వృధా అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే సన్నవడ్లు వేసి ఆర్థికంగా నష్టపోయామని..ఇప్పుడు కరెంట్ లేక పంట నష్టపోయే పరిస్థితి వచ్చిందంటున్నారు.