- నిజామాబాద్వాసిగా తేల్చిన పోలీసులు
- ఓ వ్యక్తి తీసుకెళ్లి చంపాడని అనుమానాలు
కూకట్పల్లి, వెలుగు : కేపీహెచ్‌బీ కాలనీ రోడ్‌నం.1లోని ఉదాసీన్ మఠ్‌కి చెందిన నిర్మానుష్య ప్రాంతంలో బుధవారం దొరికిన మహిళ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఆమ్రాబాద్‌కు చెందిన ప్రియాంక(30)గా తేల్చారు. ఆమెకు పెండ్లయి ఒక కూతురు కూడా ఉంది. కొంత కాలం క్రితం భర్తతో విడిపోగా, బిడ్డను వదిలి రెండు నెలల క్రితం నగరానికి వచ్చింది. తెలిసిన వారు ఎవరూ లేకపోవడం, ఉండడానికి ఏ చోటూ లేక రాత్రిళ్లు కేపీహెచ్‌బీ కాలనీ మెట్రో స్టేషన్ఫుట్పాత్పై పడుకుంటోంది.
ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆమెను ఉదాసీన్మఠ్ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అప్పుడే హత్య చేసినట్టు అనుమానిస్తుండగా, నాలుగు రోజుల తర్వాత ఆమె డెడ్‌బాడీని స్థానికులు గుర్తించారు. సంఘటన స్థలంలో పోలీసులు కండోమ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈమెను తీసుకువెళ్లిన వ్యక్తి హత్య చేయడానికి కారణం ఏమిటనేది మాత్రం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హత్యకు పాల్పడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.