అరెస్ట్ అయిన కార్మికులకు అన్నం పెట్టిన పోలీసులు

అరెస్ట్ అయిన కార్మికులకు అన్నం పెట్టిన పోలీసులు

వరంగల్ అర్బన్: ఆర్టీసీ కార్మికులపై స్నేహ పూర్వకమైన వాతావరణాన్ని కల్పించారు పోలీసులు. అరెస్ట్ అయిన ఆర్టీసీ కార్మికులకు భోజనాలు వడ్డించి మానవత్వం చాటుకున్నారు. వరంగల్ 1 , 2 , లోకల్ డిపోలకు చెందిన కార్మికులు సమ్మె విరమించి ఉదయం విధుల్లోకి చేరడానికి వచ్చారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

200 మంది కార్మికులను అరెస్ట్ చేసి శుభం ఫంక్షన్ హాల్ కి తరలించారు. అక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రభుత్వం కఠినంగా వ్యవహారించినా.. పోలీసులు కడుపు నిండా అన్నం పెట్టారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ కార్మికులు.

See Also: అమెరికాలో తెలుగు యువతిపై అత్యాచారం.. హత్య