‘చెంచల’ మూవీ పోస్టర్ రిలీజ్

‘చెంచల’ మూవీ పోస్టర్ రిలీజ్

జగదీష్ ఆచార్ దర్శకత్వంలో యధార్ధ ఘటనల ఆధారంగా ‘చెంచల’ మూవీ షూటింగ్ మొదలైంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు నిర్మాత ఏఎన్ బాలాజీ వెల్లడించారు. విజయదశమి సందర్భంగా ‘చెంచల’ మూవీ టైటిల్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్, సుజిత్ షెట్టి సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని మూవీ టీమ్ ప్రకటించింది.

టైటిల్ రోల్ కు ఓ ప్రముఖ నటి ఎంపిక పూర్తయింది. కూర్గ్ ప్రాంతంలో వచ్చేనెల నుంచి ఏకధాటిగా షూటింగ్ జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు టీమ్ ప్రకటించింది. అసలు ‘చెంచల’ అంటే ఎవరు.. చెంచలకు, పాముకు ఏమిటి సంబంధం..? చెంచల కుటుంబం హత్యకు గురైందా..? అయితే ఎలా హత్యకు గురైంది ? అనే విషయాలను క్షణక్షణం ఆసక్తికరంగా చిత్రీకరిస్తామని తెలిపింది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది.