ఒళ్లంతా నరాలు పరుచుకున్నట్టు.. చెట్టు వేర్లు భూమి లోపల పాకినట్టు.. ఆకాశానికి, భూమికి మధ్య వారధి కట్టినట్టు.. మబ్బులను చీల్చుకొచ్చి సంద్రంపై పిడుగు వేసిన పోటిది. చూడ్డానికి ఏదో ఫొటోషాప్‌లో చేసి ఉంటారులే అని అనిపించినా.. ఎలీనా సాల్వాయి అనే ఆమె తన కెమెరాతో పర్ఫెక్ట్గా తీసిన ఫొటో ఇది. అందుకే ‘వెదర్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్’ పోటీల్లో ఇది జనం మెచ్చిన ఫొటో అయింది. ఆమెకి అవార్డు తెచ్చిపెట్టింది. ఆస్ట్రేలియాలోని ట్రయల్ బే ప్రాంతంలో ఆమె ఈ పిడుగు పోటును క్లిక్‌మనిపించింది. అంతేకాదు, బ్రిటన్ రాయల్ మీటియోరోలాజికల్ సొసైటీకీ ఈ ఫొటో తెగ నచ్చేసింది. అందుకే, ఈ ఏడాది చివర్లో బ్రిటన్ అంతటా ఎగ్జిబిషన్లలో ఈ ఫొటోను ప్రదర్శించబోతోంది.
Read More News