పుష్ప మూవీ రష్యాలో కూడా రిలీజ్‌‌

పుష్ప మూవీ రష్యాలో కూడా రిలీజ్‌‌

‘పుష్ప అంటే ఫ్లవర్‌‌‌‌ అనుకుంటివా ఫైర్... పార్టీ లేదా పుష్ప..  తగ్గేదే లే.. అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్.. ఇప్పటికే ఐదు భారతీయ భాషల్లో మారుమ్రోగాయి. ప్యాన్ ఇండియా వైడ్‌‌గా ఓ ట్రెండ్‌‌ను సెట్ చేశాయి. అలాగే క్రికెటర్ డేవిడ్ వార్నర్ మొదలు పలువురు బాలీవుడ్ స్టార్స్ వరకూ చాలామంది ‘పుష్ప’లోని బన్నీ మేనరిజమ్స్‌‌ని ఇమిటేట్ చేశారు. అంతలా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు రష్యాలో రిలీజ్‌‌కు రెడీ అవుతోంది. డిసెంబర్ 8న అక్కడ డబ్బింగ్‌‌ వెర్షన్‌‌ను విడుదల చేస్తున్నారు. మంగళవారం రష్యన్‌‌ భాషలో ట్రైలర్‌‌‌‌ను కూడా విడుదల చేశారు మేకర్స్.

డిసెంబర్ 1న మాస్కోలో, 3న సెయింట్ పీటర్స్‌‌బర్గ్‌‌లో ప్రీమియర్‌‌‌‌ షోస్‌‌ ప్లాన్ చేశారు. మాస్కోలో జరిగే ప్రీమియర్‌‌‌‌ షోలో అల్లు అర్జున్, రష్మికతో పాటు దర్శకుడు సుకుమార్, నిర్మాత రవిశంకర్ పాల్గొని అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవనున్నారు. భారతీయ భాషల్లో మెప్పించిన ఈ చిత్రానికి అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే ఆసక్తి నెలకొంది. మరోవైపు డిసెంబర్ సెకెండ్ వీక్‌‌ నుండి ‘పుష్ప 2’ షూటింగ్‌‌ మొదలవబోతోంది. రష్యా నుండి రాగానే టీమ్ అంతా సెకెండ్‌‌ పార్ట్‌‌ షూటింగ్‌‌పై ఫోకస్ పెట్టబోతున్నారట. వచ్చే ఏడాది డిసెంబర్‌‌‌‌లో ఇది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.