హైదరాబాద్ లో సెంచరీకి చేరువైన పెట్రోల్ ధర

హైదరాబాద్ లో సెంచరీకి చేరువైన పెట్రోల్ ధర

దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ 28 పైసలు... డీజిల్ 25 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రేటు 99 రూపాయల 90 పైసలకు చేరింది. లీటర్ డీజిల్ రేటు .. 94 రూపాయల 82 పైసలకు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 96 రూపాయల 12 పైసలుగా ఉంది. లీటర్ డీజిల్ 86 రూపాయల 98 పైసలకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ రేట్ 102 రూపాయల 30 పైసలకు పెరిగింది. లీటర్ డీజిల్ 94 రూపాయల 39 పైసలకు చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ 99 రూపాయల 33 పైసలు... లీటర్ డీజిల్.. 92 రూపాయల 21 పైసలకు పెరిగింది.