
బెంగళూరు యూబీ సిటీలో ప్రాపర్టీల ధరల గురించి తెలిస్తే షాక్ కొట్టినంత పనవుతుంది! ఇక్కడ ఒక్కో అపార్ట్మెంట్ ధర రూ.30 కోట్ల వరకు ఉంది. ఫ్లాట్‌ను కిరాయి తీసుకోవాలంటే నెలకు రూ.10 లక్షలు ఖర్చు చేయాలి. మూడు నెలలకు ఒకసారి రూ.ఐదు లక్షలు మెయింటెనెన్స్‌గా చెల్లించాలి. ప్రెస్టిజ్ గ్రూప్, యునైటెడ్ బేవరేజెస్‌తో కలిసి ఇక్కడ ఓక్వుడ్ సర్వీస్ అపార్ట్మెంట్లను, కింగ్‌ఫిషర్ టవర్స్‌ను నిర్మించాయి. కిరణ్ మజుందార్‌షా, సచిన్ బన్సల్, అనంత్ నారాయణన్ వంటి ప్రముఖులు యూబీ సిటీలోనే నివసిస్తున్నారు. హెలిప్యాడ్, రూఫ్‌లైన్, క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్టులు, స్పా, కాఫీ షాప్స్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇక్కడ ఉన్నాయి.