‘ఇంటర్’ అఫిలియేషన్లు నత్తనడకన

‘ఇంటర్’ అఫిలియేషన్లు నత్తనడకన
  • ఇప్పటికే 355 ప్రైవేట్ కాలేజీలకే గుర్తింపు
  • మిక్స్​డ్ ఆక్యుపెన్సీ కాలేజీలపై ఆఫీసర్ల తర్జనభర్జన
  • ఈ నెలాఖరులోపే పూర్తి చేస్తామన్న ఇంటర్ బోర్డు

హైదరాబాద్, వెలుగురాష్ర్టంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఇప్పటికి 355 కాలేజీలకే ఇంటర్ బోర్డు అధికారికంగా గుర్తింపునిచ్చింది. మిగిలిన కాలేజీల అఫిలియేషన్ల ప్రాసెస్ ఇంకా సాగుతోంది. అధికారికంగా సెప్టెంబర్1 నుంచే అకడమిక్ క్యాలెండర్ ప్రారంభమైంది. 2020-21 విద్యాసంవత్సరానికి గానూ స్టేట్​లో 1,661 ప్రైవేటు జూనియర్ కాలేజీలు గుర్తింపు కోసం ఇంటర్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నాయి. శుక్రవారం నాటికి 355 ప్రైవేటు కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపునిచ్చింది. మరో 599 కాలేజీలు దరఖాస్తు చేసినా, వాటిల్లో సరైన సర్టిఫికేట్లు లేక మళ్లీ కాలేజీల లాగిన్​లోకే పంపించారు. 223 కాలేజీల అఫిలియేషన్​ ప్రాసెస్​ పెండింగ్​లో ఉంది.

మిక్స్ డ్  ఆక్యుపెన్సీ కాలేజీలపై తర్జనభర్జన

మిక్స్​డ్ ఆక్యుపెన్సీ పరిధిలో ఉన్న 354 కాలేజీలకు ఎలా గుర్తింపు ఇవ్వాలనే దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఒకే భవనంలో విద్యాసంస్థలు మాత్రమే ఉంటే, అలాంటి వాటికీ పర్మిషన్ ఇవ్వాలని యోచిస్తున్నారు. కాలేజీ బిల్డింగ్ కింద కమర్షియల్ కాంప్లెక్స్​లు ఉంటే ఇవ్వాలా వద్దా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫైర్ ఎన్ఓసీ అంశంపై ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్​ఇవ్వడంతో దాదాపు అన్ని కాలేజీలకు గుర్తింపు వచ్చే అవకాశముంది. ప్రైవేటు కాలేజీల అఫిలియేషన్​ ప్రాసెస్​ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్  చెప్పారు. కరోనా నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు గుర్తింపు ఇవ్వాలని ప్రైవేటు కాలేజీల మేనేజ్ మెంట్ల సంఘం ప్రెసిడెంట్ గౌరీ సతీశ్ విజ్ఞప్తి చేశారు. అన్ని కాలేజీల్లో ఫైర్​ సెఫ్టీ పరికరాలను ఫిక్స్‌ చేస్తున్నామని, మిక్స్​డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకూ అఫిలియేషన్​ ఇవ్వాలని కోరారు.

ఇంటర్ లో ఇక ఒకే హాల్ టికెట్!
రెండు హాల్ టికెట్ల విధానానికి స్వస్తి చెప్పేందుకు ఇంటర్ బోర్డు యోచిస్తోంది. రెండు హాల్ టికెట్లు ఉండటంతో ఎంసెట్ సహా పలు ఎంట్రెన్స్​ టెస్టుల్ లో సమస్యలు తలెత్ తుతుండటంతో ప్రత్యామ్ నాయ చర్యలపై ఆఫీసర్లు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కు వేర్వేరుగా హాల్ టికెట్లు ఇస్తున్నారు. దీంతో చాలామంది స్టూడెంట్లు ఎంట్రెన్స్​ఎగ్జామ్స్ ​అప్లికే షన్లలో సెకండియర్ కు బదులు ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్లు ఎంట్రీ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది సుమారు వెయ్యి మందికిపైగా
స్టూడెంట్స్ ​ఎంసెట్ లో ర్యాంకులు పొందలేదు. ఇతర పోటీ పరీక్షల్లో నూ ఇదే సమస్య వస్తుండటంతో బోర్డు అధికారులు హాల్ టి కెట్లపై పునరాలోచనలో పడ్డారు. మరోవైపు సిలబస్ తగ్గింపులో వివాదం రావడంతో ఇంటర్ బోర్డు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేకంగా సబ్ కమిటీ వేసి తాజా మార్పులతో సిలబస్ లో కోతపెడుతోంది. కమిటీ సూచించిన ప్రతిపాదనలను ఇటీవల ప్రభుత్వానికి పంపింది.