
హైదరాబాద్ సిటీ, వెలుగు: అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్ఆధ్వర్యంలో శనివారం నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా చుట్టపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. యూసుఫ్ గూడ – జవహర్‌లాల్‌నెహ్రూ రోడ్ – అబిడ్స్ సర్కిల్ – ఓల్డ్ హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ – చిరాగ్ అలీ – నాంపల్లి స్టేషన్ రోడ్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు ఉంటాయన్నారు.
ఈ సమయాల్లో గన్ ఫౌండ్రీ, తిలక్ రోడ్ జంక్షన్ నుంచి నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను.. జీపీవో జంక్షన్ వద్ద ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు. జాంబాగ్ రోడ్, ఎస్ఏ బజార్ మసీదు నుంచి జీపీవో జంక్షన్ వైపు వచ్చే వాహనాలను.. ఎంజే మార్కెట్ వద్ద గాంధీ భవన్, చాపల్ రోడ్ వైపు పంపిస్తారు.
నాంపల్లి నుంచి కోటి బ్యాంక్ స్ట్రీట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను హెచ్‌పీ పెట్రోల్ పంప్ -ఏసీబీ లేన్–యూసుఫ్– ట్రూప్ బజార్– కోటి బ్యాంక్ స్ట్రీట్ నుంచి అనుమతిస్తారు. హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించాలని కోరారు. అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయానికి వచ్చే భక్తులు వాహనాలను నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పార్క్ చేసుకోవచ్చని తెలిపారు.