ఈనెల 27 నుంచి ప్రభుత్వ టీచ‌ర్ల ప‌దోన్నతులు, బ‌దిలీల ప్రక్రియ‌ షురూ

ఈనెల 27 నుంచి ప్రభుత్వ టీచ‌ర్ల ప‌దోన్నతులు, బ‌దిలీల ప్రక్రియ‌ షురూ

హైద‌రాబాద్ : ఈ నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ టీచ‌ర్ల ప‌దోన్నతులు, బ‌దిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని టీచ‌ర్ల ప‌దోన్నతులు, బ‌దిలీల‌పై విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స‌మీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు ఉపాధ్యాయుల ప్రమోష‌న్లు, బ‌దిలీల‌కు సంబంధించి మంత్రి స‌బిత బ‌షీర్‌బాగ్‌లోని విద్యాశాఖ కార్యాల‌యంలో విద్యాశాఖ కార్యద‌ర్శి వాకటి క‌రుణ‌, పాఠ‌శాల విద్యా డైరెక్టరేట్ దేవ‌సేన, ఇత‌ర అధికారులతో స‌మీక్షించారు. ఈ నెల 27 నుంచి దీనికి సంబంధించిన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు.