గేమ్‌ ఛేంజర్‌ సాంగ్ లీక్ పై చట్టపరమైన చర్యలు.. నిందితులపై క్రిమినల్ కేసు

గేమ్‌ ఛేంజర్‌ సాంగ్ లీక్ పై చట్టపరమైన చర్యలు.. నిందితులపై క్రిమినల్ కేసు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్(Game changer) సినిమా నుండి సాంగ్ లీకైందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జాబిలమ్మ అంటూ సాగిన ఈ పాట సగానికన్నా ఎక్కువే లీకైంది. దీంతో ఈ పాటను లీక్ చేసిన వారిపై తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లీగల్ గా యాక్షన్ తీసుకోనున్నారు.  ఐపీసీ సెక్షన్(C) కింద క్రిమినల్ కేస్ బుక్ చేశారు. 

దీనిపై అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ పాటను అనధికారికంగా రిలీజ్ చేసిన వారిపై చట్ట పరమైన చెర్యలు తీసుకుంటున్నాం. వారిపై ఐపీసీ సెక్షన్(C) కింద క్రిమినల్ కేస్ బుక్ చేసాం. దయచేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాసిరకం క్వాలిటీ పాటను ఎంకరేజ్ చేయకండి... అంటూ రాసుకొచ్చారు.

ఇక గేమ్‌ ఛేంజర్‌ సినిమా విషయానికి వస్తే.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ డ్యూయల్ రోల్ కనిపిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ డ్రామాగా రానున్న ఈ సినిమాకు తమ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.