
ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ముందొచ్చేది ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఊరిస్తూ వస్తోంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో హైప్ మరింత ఎక్కువగా ఉంది. కానీ, సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు. అయితే, ఇపుడీ రాజాసాబ్ మరింత దూరం వెళ్లినట్లు సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. రాజాసాబ్ మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే, ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఈ కొత్త రిలీజ్ డేట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.
వాస్తవానికి ఏప్రిల్ 10న తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ కొంత భాగం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు. దీంతో జూలై 18 రిలీజ్ అని టాక్ ఉండే. అది కూడా దాటేసారు మేకర్స్.
ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేశారని టాక్ వినిపించింది. అప్పుడు కూడా కుదరకపోతే సెప్టెంబర్ నెలలో వస్తుందని రాజాసాబ్ టీమ్ నుంచి టాక్ వచ్చింది.
Finally 05.12.2025 release... 👍✅
— Hari K (@brahmi_fan) May 26, 2025
Teaser with release date in June 2nd week... #Prabhas #TheRajaSaab pic.twitter.com/5JJUpPo2Iz
ఇక ఇవన్నీ కాకుండా ఇపుడు డిసెంబర్ 5 అని కొత్త డేట్ ఫిక్స్ అయిందని తెలియడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అయ్యారు. ఎన్నిసార్లు డేట్స్ మారుస్తూ వెళతారు? అసలు సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందా సార్ చెప్పండి అంటూ? ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, త్వరలో రానున్న టీజర్తో అయిన.. రిలీజ్ డేట్‌పై స్పష్టత రావచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో!
HIGH ALERT…‼️
— Director Maruthi (@DirectorMaruthi) April 23, 2025
HEAT WAVES gonna rise even higher from mid May! 🔥🔥🔥 pic.twitter.com/EdEdtMCq6E
ఇకపోతే, ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ మరియు బ్రహ్మానందం ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.సుమారు రూ.200కోట్ల బడ్జెట్‍తో రూపొందుతోందని అంచనా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.