వీడియో వైరల్: 25 మంది యంగ్ IPS ఆఫీసర్స్ : ట్రైనింగ్లో భాగంగా అమీర్ ఖాన్ ఇంటికి..!

వీడియో వైరల్: 25 మంది యంగ్ IPS ఆఫీసర్స్ : ట్రైనింగ్లో భాగంగా అమీర్ ఖాన్ ఇంటికి..!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పేరు మరోసారి చర్చల్లో నిలిచింది. ఆదివారం (జూలై 27న) ముంబై బాంద్రాలోని ఆయన ఇంటికి 25 మంది ఐపీఎస్‌ ఆఫీసర్స్ వెళ్లడం బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

జులై 27న ఓ లగ్జరీ బస్సులో 25 మంది యంగ్ ఐపీఎస్‌ ఆఫీసర్స్.. అమీర్ ఖాన్ ఇంటికి వెళ్లిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఇందులో పోలీసుల బస్సు, వ్యాన్‌లలో ఆమిర్‌ ఇంటికి వచ్చారు. అయితే, ఇంతమంది ఒక్కసారిగా అమీర్ ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై ఊహాగానాలు జోరుగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇది అతని అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

ALSO READ | మొదలైన రష్మిక మందన్న మైసా మూవీ షూటింగ్

లేటెస్ట్గా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. “ప్రస్తుత బ్యాచ్‌లోని ఐపీఎస్ ట్రైనింగ్ ఆఫీసర్స్ హీరో అమీర్ ఖాన్‌తో సమావేశం కావాలని కోరడంతో, అమీర్ వారికి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చాడని” బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఇప్పటివరకు అమీర్ ఖాన్ ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. అధికారికంగా ఓ క్లారిటీ వస్తేనే ఫ్యాన్స్లో ఉన్న ఊహాగానాలకు అడ్డుతెర పడనుంది.

ఈ క్రమంలో రేపు (జూలై 29న) ఆమిర్ ఖాన్‌.. ముంబైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఒక ప్రకటన చేయనున్నట్లు టాక్. ఈ అప్డేట్పై ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం అమీర్ ఖాన్‌ హీరోగా, నిర్మాతగా రాణిస్తున్నాడు. చాలా కాలంగా ప్రతిష్టాత్మకమైన మహాభారతాన్ని నిర్మించాలని భావిస్తున్నాడు. మరి రేపు నిర్వహించే సమావేశం మహాభారతం సినిమా గురించా? లేదా ఇపుడు వైరల్ వీడియోకి సంబందించా? అనేది చర్చనీయాంశంగా ఉంది.

ఇదిలా ఉంటే.. త్వరలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌కు (IFFM) అమీర్ చీఫ్ గెస్ట్గా అటెండ్ అవ్వనున్నారు. ఆగస్టు 14 నుంచి 24 వరకూ ఈ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఈ ఈవెంట్లో అమీర్ రీసెంట్ ఫిల్మ్ ‘సితారే జమీన్‌ పర్‌’ను ప్రదర్శించనున్నారు.

‘సితారే జమీన్‌ పర్‌’ విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ బాస్కెట్‌బాల్‌ కోచ్‌ అయిన గుల్షన్‌ పాత్రలో నటించారు. మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న (ఆటిజం ఉన్న పిల్లల) బృందాన్నీ,ప్లేయర్స్‌గా ఎలా తీర్చిదిద్దారనే కథాంశంతో మూవీ రూపొందింది. 2007లో వచ్చిన ‘తారే జమీన్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌’కి ఇది సీక్వెల్. ఎమోషనల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌ అయినప్పటికీ వీలయినంత ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా తెరకెక్కించారు.