టార్గెట్ బుద్దేల్! కోకాపేట భూంతో హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం

టార్గెట్ బుద్దేల్! కోకాపేట భూంతో హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం
  • కోకాపేట భూంతో హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం
  • అమ్మకానికి జాగా.. కనీస ధర రూ. 20 కోట్లు
  • రూ. 3 వేల కోట్లు ఆర్జించడమే సర్కారు లక్ష్యం 

హైదరాబాద్ : కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధరలు రావడం హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం నింపింది. అదే తరహాలో బుద్వేల్ భూముల అమ్మకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 100 ఎకరాల స్థలాన్ని హెచ్ఎండీఏ ద్వారా విక్రయించనున్నారు. మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 3.47 ఎకరాల నుంచి 14.33 ఎకరాల వరకు ఉంది. ఎకరాకు రూ.20 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. ఆరో తేదీన ప్రీబిడ్ సమావేశం.. ఎనిమిదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఈ -వేలం నిర్వహించనున్నట్లు చెప్పారు. వీటి ద్వారా కనీసం రూ.3వేల కోట్ల ఆదాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేస్తోంది.