‘‘వకీల్ సాబ్’’ విడుదల తేదీ ఖరారు

V6 Velugu Posted on Jan 30, 2021

  • ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 9వ తేదీన థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు శిరీష్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన వకీల్ సాబ్ టీజర్.. కు మంచి స్పందన రావడంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయి. రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు మానేసిన చాలా కాలానికి వస్తున్న ఈ సినిమాపై పవర్ స్టార్ అభిమానుల్లోనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం అంచనాలు షేక్ చేస్తున్నాయి. పవర్ స్టార్‌కు మరచిపోలేని విజయాన్ని అందించిన గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్ తోపాటు.. నివేదితా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్నారు. మ్యూజిక్ తమన్ స్వరాలు సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఆదాయం లేక 31 స్టేషన్లు మూసివేయనున్న దక్షిణ మధ్య రైల్వే

ఒకప్పుడు క్వింటం పసుపు అమ్మితే తులం బంగారం వచ్చేది

పీఆర్సీపై టీచర్ల ఆగ్రహం.. త్రివేణి సంగమంలో పీఆర్సీ ప్రతుల నిమజ్జనం

టెన్త్ అర్హతతో పోస్టల్​ జాబ్స్​.. రోజుకు నాలుగు గంటలే డ్యూటీ

రాష్ట్రంలో ఆర్టీఐ యాక్ట్ బేఖాతర్ : ఇన్ఫర్మేషన్ దాస్తున్నరు!

 

Tagged RELEASE, april 9th, date, finalised, movie, Pavan kalyan, theatres, upcoming, wakeel saab

Latest Videos

Subscribe Now

More News