
బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kanagana Ranaut) సినిమాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. పి వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్(Raghava Lawrence), కంగనా రనౌత్ నటించిన సినిమా చంద్రముఖి–2(Chandramukhi 2). ఇప్పటికే స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ నెల (సెప్టెంబర్) 15న ఈ మూవీ థియేటర్లలోకి రానుండగా మరో రెండు వారాల పాటు వాయిదా వేసినట్టు సమాచారం. కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా మూవీ విడుదలను వాయిదా వేశారనే టాక్ వినిపిస్తోంది.
అయితే, రెండు వారాల తర్వాత ఈ నెల సెప్టెంబర్ 28న మూవీ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ పోస్ట్‌పోన్‌తో 15వ తేదీన విడుదలకు సిద్ధమైన విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ సినిమాకు పోటీ లేకుండా పోయింది. కానీ, చంద్రముఖి రిలీజ్ రోజే తమిళ హీరోల సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.
తని ఒరువన్ మూవీతో స్టార్ హీరోగా మారిన జయం రవి ఇరైవన్, హరీష్ కళ్యాణ్, ఇంధుజ నటించిన పార్కింగ్, SU అరుణ్ కుమార్ డైరెక్టర్ గా సిద్ధార్థ్ నటించిన చిత,అలాగే విజయ్ ఆంటోని రథం మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ పోటీని తట్టుకుని కంగనా సినిమా నిలుస్తుందా? అనేది వేచి చూడాలి.
చంద్రముఖి 2లో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాసన్ తదితరులు నటించారు. ఈ మూవీకి ఎంఎం కీరవాణి స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.