
కల్తీ పాలు, కల్తీ నూనె... ఇప్పుడు కల్తీ వ్యాక్సిన్లు కూడా వచ్చేశాయి. ముంబైలో స్కామ్ బయటపడింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా... కొంతమంది వచ్చి ఫేక్ టీకా వేశారని చెప్తున్నారు బాధితులు. ముంబైలోని హౌసింగ్ సొసైటీలో 390 మందికి టీకాలు వేశారు. వ్యాక్సిన్ వేసుకున్నాక వీళ్లకు ఎలాంటి సింటమ్స్ కనిపించలేదు. డిఫరెంట్ హాస్పిటళ్ల నుంచి టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్లు వచ్చాయి. దాంతో డౌట్ వచ్చి సంబంధింత హాస్పిటళ్లకు ఫోన్ చేశారు. అయితే ఆ వ్యాక్సిన్లు వేసింది మేం కాదని ఆ హాస్పిటళ్లు చెప్పడంతో... టీకా వేసుకున్న వాళ్లు షాక్ తిన్నారు.