పిల్ల ఏనుగుకు ‘Z+++’ కేట‌గిరి భ‌ద్రత..?

పిల్ల ఏనుగుకు ‘Z+++’ కేట‌గిరి భ‌ద్రత..?

వీవీఐపీలు, రాజ‌కీయ నాయ‌కులు, ప్రముఖుల‌కు మాత్రమే జ‌డ్ ప్లస్ ప్లస్ ప్లస్ కేట‌గిరి భ‌ద్రత ఉంటుంది. కానీ, ఓ పిల్ల ఏనుగుకు కూడా ఆ తరహా కేటగిరి భద్రత ఉంది. కానీ, ఇక్కడ భద్రత కల్పిస్తుంది మూగజీవాలే. సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ ఒక ఏనుగుల గుంపు వెళ్తున్న వీడియోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

అప్పుడే పుట్టిన పిల్ల ఏనుగుకు మిగ‌తా ఏనుగులు జ‌డ్ ప్లస్ ప్లస్ ప్లస్ కేటగిరి తరహాలో భ‌ద్రత క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నాయి. ‘ఈ భూమ్మీద ఎవ‌రూ కూడా ఇంత భ‌ద్రత క‌ల్పించ‌లేరు. అది కేవ‌లం ఏనుగుల గుంపునకు మాత్రమే సాధ్యమైంది’ అంటూ కామెంట్స్ చేశారు. కోయంబ‌త్తూర్‌లోని స‌త్యమంగ‌ళం ప్రాంతంలో ఈ వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ  వీడియో వైర‌ల్ అవుతోంది.