బలపరీక్షలో విజయం సాధిస్తాం

బలపరీక్షలో విజయం సాధిస్తాం

మహారాష్ట్రలో అనేక నాటకీయ పరిణామాల మధ్య కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జులై 4న నిర్వహించనున్న విశ్వాస పరీక్షపై అందరి దృష్టి నెలకొంది. బలపరీక్షలో తప్పక విజయం సాధిస్తామని సీఎం ఏక్ నాథ్ షిండే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గోవాలో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు రేపు ముంబైకి చేరుకుంటారని చెప్పారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఆ సంఖ్య మరింత పెరుగుతుందని షిండే విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమకు పూర్తి మెజారిటీ ఉందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. 

ముంబయిలో కురుస్తున్న వర్షాలపై ముంబయి కార్పొరేషన్ కమిషనర్ తో  చర్చించినట్లు షిండే చెప్పారు. రైతుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని.. రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.